Header Banner

గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు మరో షాక్! ట్రంప్ కీలక ప్రకటన!

  Tue May 06, 2025 21:25        U S A

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ .. ఇప్పటికీ వారిపై అదే స్ధాయిలో కోపం ప్రదర్శిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న వీసాదారులు, గ్రీన్ కార్డుదారులతో పాటు కొత్తగా వీటి కోసం దరఖాస్తు చేసుకునే వారిని సైతం టార్గెట్ చేస్తున్న ట్రంప్ సర్కార్.. తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. దీంతో అమెరికా వీసా, గ్రీన్ కార్డుదారులు వణికిపోతున్నారు.

 

విదేశీయులు చట్టాన్ని ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డులు, వీసాలు రద్దు చేస్తామంటూ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా ఎక్స్ లో ఓ పోస్టు చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. వీసా లేదా గ్రీన్ కార్డ్ కలిగి ఉండటం అనేది తీసివేయదగిన ప్రత్యేక హక్కు అని ఈ పోస్టులో పేర్కొంది. అలాగే మీకు అమెరికాకు ప్రవేశం లభించినంత మాత్రాన తమ కఠినమైన భద్రతా తనిఖీ ముగిసిపోదని తెలిపింది. మీరు మా దేశానికి వచ్చి చట్టాన్ని ఉల్లంఘిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అలాగే మీరు మీ ప్రత్యేక హక్కులను కోల్పోతారని కూడా తెలిపింది.

 

 ఇది కూడా చదవండిఉగ్రవాదంపై భారత్‌కు మా సంపూర్ణ మద్దతు.! తేల్చిచెప్పిన అమెరికా - తమకు అత్యంత కీలకమైన!

 

అమెరికాకు వచ్చి వీసా లేదా గ్రీన్ కార్డ్ పొందడం ఒక ప్రత్యేక హక్కు అని, మన చట్టాల, విలువలను గౌరవించాలని ప్రభుత్వం కోరింది. మీరు హింసను సమర్థిస్తే, ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థిస్తే లేదా మద్దతు ఇస్తే, లేదా ఇతరులను అలా చేయమని ప్రోత్సహిస్తే, మీరు ఇకపై అమెరికాలో ఉండటానికి అర్హులు కాదని స్పష్టం చేసింది. వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్ల పత్రాలు జారీ చేసిన తర్వాత కూడా వారిని జాగ్రత్తగా సమీక్షించడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖతో కలిసి పనిచేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ అథారిటీ తెలిపింది. అమెరికాను తిరిగి సురక్షితంగా ఉంచడానికి ఈ అప్రమత్తత చాలా అవసరమని పేర్కొంది.

తమ చట్టాలను ఉల్లంఘించే అమెరికా పౌరులు కాని వారిని ప్రభుత్వం పట్టుకున్నప్పుడల్లా, వారి హోదాను రద్దు చేయడానికి చర్య తీసుకుంటామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. మన దేశం యొక్క దాతృత్వాన్ని దుర్వినియోగం చేసే యుగం ముగిసిందని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిపై దేశంలో ఇప్పటికే వీసాలు, గ్రీన్ కార్డులతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న విదేశీయుల్లో తిరిగి భయాలు మొదలయ్యాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USImmigration #GreenCardWarning #VisaPolicy #DonaldTrump #ImmigrationReform